Hyderabad: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. మరో రెండు రోజులు వానలే!

  • కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  • భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్‌, ఉత్తర కోస్తా ఒడిశాలను ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.

 దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో నేడు, రేపు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

More Telugu News