chiranjeevi: హిందీలో రీమేక్ కానున్న 'ఖైదీ నెంబర్ 150'

  • విజయ్ కి హిట్ తెచ్చిపెట్టిన 'కత్తి'
  • చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన 'ఖైదీ నెంబర్ 150' 
  • సంజయ్ లీలా బన్సాలి చేతికి హిందీ రీమేక్ హక్కులు    

తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన 'కత్తి' సినిమా, ఆయన కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. దాంతో తన రీ ఎంట్రీకి చిరంజీవి ఈ సినిమానే ఎంచుకున్నారు. అలా 'కత్తి' రీమేక్ గా 'ఖైదీ నెంబర్ 150' తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగులోను ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టి, చిరంజీవి కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలి హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. అయితే ఈ సినిమాకి ఆయన దర్శకత్వం వహించకపోవచ్చనీ, కేవలం నిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకత్వ బాధ్యతలను వేరేవారికి అప్పగించవచ్చని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.   

More Telugu News