Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు... సర్వదర్శనానికి 20 గంటల సమయం!

  • మహాసంప్రోక్షణ సమయంలో పలుచగా భక్తుల సంఖ్య
  • వారాంతం నుంచి ఒక్కసారిగా పెరిగిన రద్దీ
  • దర్శనం కోసం వేచి చూస్తున్న వారికి అన్న పానీయాలు

అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణం జరిగినన్ని రోజులూ తిరుమల కొండపై పలుచగా ఉన్న భక్తుల సంఖ్య వారాంతం కలసి రావడంతో ఒక్కసారిగా పెరిగిపోయింది. శనివారం నుంచి మొదలైన రద్దీ నేడూ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం టోకెన్లున్న భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో వేచి ఉన్న వారికి ఆహార, పానీయాలు అందిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆదివారం నాడు 70 వేల మందికి పైగా స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.

More Telugu News