Kerala: కేరళకు రైళ్లలో నీరు, బిస్కెట్లు, మందులు!

  • కేరళలో ఊపందుకుంటున్న సహాయక చర్యలు
  • చురుకుగా పాల్గొంటున్న పలు రాష్ట్రాల బృందాలు
  • నైరుతి రైల్వే అధికారుల ప్రత్యేక రైళ్లు

జలవిలయానికి గురైన కేరళలో సహాయక చర్యలు ఊపందుకుంటున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద కారణంగా నిరాశ్రయులైన వారికి సాయం చేసేందుకు యంత్రాంగం కదిలింది. పలు రాష్ట్రాలు సైతం స్పందించి సాయం చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపుతున్నాయి.

నైరుతి రైల్వే అధికారులు నీరు, ఆహారం, బిస్కెట్లు, ఔషధాలను పంపేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థుల బృందం వీటిని తీసుకుని వెళుతోంది. మొత్తం 23 టన్నుల ఆహారం నేటి మధ్యాహ్నానికి కేరళ చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. మరో రైలును కూడా పంపనున్నామని పేర్కొన్నారు. ఈ రైళ్లలో బియ్యం, రవ్వ, గోధుమ పిండి, నూనె, నీరు, ఉల్లిపాయలు, పప్పు, టీ పొడి, పాలు, పాలపొడి, చక్కెర, దుప్పట్లు తదితరాలు ఉన్నాయని తెలిపారు.

More Telugu News