geetha govindam: 'గీతగోవిందం' సక్సెస్ మీట్ కు హాజరైన మెగాస్టార్!

  • హైదరాబాద్ లో 'గీతగోవిందం' సక్సెస్ మీట్
  • వేడుకకు హాజరైన చిరంజీవి
  • బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న విజయ్ దేవరకొండ చిత్రం

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా విడుదలైన 'గీతగోవిందం' హిట్ టాక్ తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాదులో సక్సెస్ మీట్ ను నిర్వహిస్తోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ లు హాజరయ్యారు. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆహూతులకు మట్టి వినాయకుడిని అందిస్తున్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించాడు. గీతా ఆర్ట్స్-2 ఈ చిత్రాన్ని నిర్మించింది.

More Telugu News