Hardik Patel: పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ అరెస్ట్

  • హార్దిక్ పటేల్ నిరాహార దీక్ష భగ్నం
  • దీక్షకు బయల్దేరిన హార్దిక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • పోలీసుల అదుపులో పలువురు యువకులు

నికోల్ గ్రౌండ్ లో పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమకారుడు చేపట్టనున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పటీదార్లకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని, రైతు సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ తో ఒకరోజు నిరాహార దీక్షలో పాల్గొనేందుకు నికోల్ వెళ్తున్న హార్దిక్ పటేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హార్దిక్ పటేల్ తో పాటు ఇతర పటీదార్ నేతలను అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈనెల 25 నుంచి నికోల్ గ్రౌండ్‌లో నిరవధిక నిరాహార దీక్షకు అనుమతి కోరినప్పటికీ పోలీసులు నిరాకరించారని, నికోల్ గ్రౌండ్‌ను చివరి నిమిషంలో పార్కింగ్ గ్రౌండ్‌గా మార్చేశారని నిన్న హార్దిక్ పటేల్ ఆరోపించారు. నికోల్ గ్రౌండ్ లో నిలిపి ఉంచిన కారులోనే ఆదివారంనాడు నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితికి చెందిన 501 మంది యువకులు నిరసన తెలుపుతామని అన్నారు. ఈ నేపథ్యంలో నిరాహార దీక్షకు నికోల్ బయలుదేరిన హార్దిక్ సహా పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News