correspondence course: ఉర్దూ కరస్పాండెంట్ కోర్స్... జస్ట్ రూ. 100 ఫీజు!

  • ఉర్దూ కరస్పాండెంట్ కోర్సు అందిస్తున్న జేఎంఐ యూనివర్సిటీ
  • సంవత్సరంలో ఎప్పుడైనా కోర్సులో చేరే అవకాశం
  • రూ. 100 నామమాత్రపు ఫీజుతో సంవత్సరం పాటు కోర్సు

ఉర్దూ నేర్చుకోవాలనే కోరిక ఉందా? అయితే ఉర్దూ కరస్పాండెంట్ కోర్సులో జాయినయిపోండి. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) యూనివర్సిటీ ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంవత్సర కాలవ్యవధి గల ఉర్దూ కరస్పాండెన్స్ కోర్సును యూనివర్సిటీలోని అర్జున్ సింగ్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఓపెన్ లెర్నింగ్ విభాగం ఆధ్వర్యంలో అందిస్తున్నారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎవరైనా రూ.100 నామమాత్రపు ఫీజు చెల్లించి ఉర్దూ భాషను నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ మీడియంలలో పాఠ్యాంశాల బోధన ఉంటుంది. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఓపెన్ లెర్నింగ్ విభాగం ద్వారా కోర్సుకు సంబంధించిన అప్లికేషన్ ఫాం, ప్రాస్పెక్టస్‌ను పొందవచ్చు. ఇందుకు గాను ఆసక్తి ఉన్న అభ్యర్థులు రూ.100 పోస్టేజ్‌తో కూడిన ఎన్వలప్‌ను పంపించాల్సి ఉంటుంది. ఈ కోర్సుకు ఎలాంటి ట్యూషన్ ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.

jmi.ac.in/upload/centres/cdol/uccform.pdf వెబ్‌సైట్‌ను సందర్శించి అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను నమోదు కోసం అప్లికేషన్ ఫాంను పొందవచ్చు. సార్క్ దేశాల అభ్యర్థులకు ఈ ఫీజును 20 డాలర్లుగా, ఇతర దేశాల వారి 50 డాలర్లుగా నిర్ణయించారు. కోర్సుకు దరఖాస్తుకు చేసుకునేందుకు ఎలాంటి గడువు తేదీ లేదని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఏడాదిలో ఎప్పుడైనా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

More Telugu News