Asian Games-2018: ఆసియన్ గేమ్స్ లో భారత్ బోణీ.. గురి తప్పని షూటర్లు!

  • 10 మీటర్ల మిక్స్ డ్ షూటింగ్ ఈవెంట్ లో కాంస్యం
  • తొలి పతకం అందించిన అపూర్వీ చండీలా, రవి జోడీ
  • సెప్టెంబర్ 2 వరకూ కొనసాగనున్న క్రీడా సంగ్రామం

ఇండోనేసియాలో ప్రారంభమైన ఏసియన్ గేమ్స్ తొలిరోజే భారత షూటర్లు బోణి కొట్టారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో ఈ రోజు అపూర్వీ చండీలా, రవి కుమార్ జోడీ భారత్ కు కాంస్య పతకం అందించింది.

ఈ పోటీలో చైనీస్ తైపీ జట్టు 494.1 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, చైనా జట్టు 492.5 పాయింట్లతో రజత పతకం సాధించింది. అపూర్వీ చండీలా, రవి కుమార్ లు ఈ పోటీలో 390.2 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకున్నారు.

ఆదివారం ఇండోనేసియాలోని జకార్తాలో ఏసియన్ గేమ్స్-2018 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకూ ఈ పోటీలు జకార్తా, పాలెంబంగ్ నగరాల్లో జరగనున్నాయి.

More Telugu News