Tirumala: ఆన్ లైన్ లక్కీడిప్ కూడా అక్రమార్కుల పాలు... తిరుమల సేవా టికెట్ల కుంభకోణం వెనుక మరిన్ని నిజాలు!

  • వేల ఆధార్ కార్డులతో రిజిస్ట్రేషన్లు
  • నెలకు కనీసం 100 టికెట్లు పొందుతున్న దళారీ
  • వాటిని అధిక ధరకు విక్రయిస్తూ లాభార్జన

తిరుమల వెంకటేశ్వరునికి సేవ చేసుకునే భాగ్యం కలగాలని కోరుకునే లక్షలాది మంది భక్తులకు, పారదర్శకంగా టికెట్లను అందించాలన్న సదుద్దేశంతో టీటీడీ ప్రవేశపెట్టిన ఆన్ లైన్ లక్కీ డిప్ లోనూ కుంభకోణం వెలుగుచూడటం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. షోలాపూర్ కు చెందిన ఓ దళారీకి ప్రతి నెలా 200 వరకూ సేవా టికెట్లు అందాయని, వాటిని ఇతరులకు విక్రయించేవాడని తెలుసుకున్న అధికారులు అవాక్కయ్యారు. అసలు ఎలా ఇన్ని టికెట్లు అతని ఖాతాకు వెళ్లాయని విచారించారు.

పట్టణానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి, వేలాది మంది ఆధార్ కార్డు నంబర్లను సేకరించి, ప్రతి నెలా ఆన్ లైన్ డిప్ కు అందరి పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకునేవాడు. వేల సంఖ్యలో ఉన్న రిజిస్ట్రేషన్లలో కనీసం 100 వరకూ టికెట్లు ప్రభాకర్ రిజిస్టర్ చేసిన ఆధార్ నంబర్లకు దక్కుతుండగా, వాటిని అధిక ధరకు విక్రయించి, ఆపై టికెట్ పొందిన అసలు వ్యక్తి పేరిట ఉన్న ఆధార్ కార్డుకు నకిలీ కార్డు తయారు చేసి టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తికి ఇచ్చి పంపుతుంటాడు.

గత నవంబర్ నుంచి ఈ దందా సాగుతున్నట్టు గుర్తించిన అధికారులు, ఇదే తరహాలో దళారీలు చెన్నై, గుంటూరు ప్రాంతాల్లో కూడా ఉండివుండవచ్చని అనుమానిస్తున్నారు.

More Telugu News