తక్షణం సైన్యం రాకుంటే 10 వేల మంది చనిపోతారు... చంగన్నూరు ఎమ్మెల్యే కన్నీటి విన్నపం!

- అలపుళ జిల్లాను సర్వనాశనం చేసిన వరదలు
- ప్రజలను కాపాడాలంటే హెలికాప్టర్లు రావాల్సిందే
- చిన్న పడవలు కొట్టుకు పోతున్నాయని సాజీ చరియన్ ఆవేదన
ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించి తమకు సాయం చేయాలని, కొన్ని హెలికాప్టర్లను తక్షణం పంపాలని ఆయన అన్నారు. కేవలం హెలికాప్టర్లు వస్తే మాత్రమే ప్రజలను రక్షించగలుగుతామని ఆయన అన్నారు. పేద మత్స్యకారుల నుంచి పడవలను అద్దెకు తీసుకున్నప్పటికీ, నీటి ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో అవి ఏమాత్రం తమ అవసరాలు తీర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలు మర పడవలు నీట మునిగి కొట్టుకుపోయాయని చెప్పిన ఆయన, ఇప్పటివరకూ చెంగన్నూరు పట్టణ ప్రజలకు ఒక్క ఆహార పొట్లం కూడా దొరకలేదని ఆరోపించారు.