Drunk Driving: పోలీసులను చూసి పారిపోబోయి గాయాలపాలైన మందుబాబు... ఒక్క జూబ్లీహిల్స్ లోనే పట్టుబడ్డ 148 మంది!

  • రెచ్చిపోయిన మందుబాబులు
  • పట్టుబడిన 86 బైకులు, 61 కార్లు
  • పారిపోబోయిన యువకుడికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ లో ఈ వారాంతం మందుబాబులు రెచ్చిపోయారు. ఒక్క జూబ్లీహిల్స్ పరిధిలోనే డ్రంకెన్ డ్రైవ్ లో 148 మంది పట్టుబడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శనివారం రాత్రి రోడ్ నంబర్ 36/10లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు నిర్వహించగా, 86 బైకులు, 61 కార్లు, ఒక ఆటో పట్టుబడ్డాయి. ఈ వాహనాలను సీజ్ చేశామని, మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టు ముందు ప్రవేశపెడతామని పోలీసు అధికారులు తెలిపారు. ఇక ఇదే ప్రాంతంలో తనిఖీలకు చిక్కకుండా పారిపోబోయిన ఓ మందుబాబు వాహనం, అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.

More Telugu News