Rajamouli: 'కేరాఫ్ కంచరపాలెం' బాగా నచ్చిందంటున్న రాజమౌళి

  • 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా తన మనసుకు హత్తుకుందన్న రాజమౌళి 
  • నచ్చితే బాగుందని చెప్తా కానీ చూడమని చెప్పను.. కానీ ఈ సినిమా చూడండి 
  • అంతా నూతన నటీనటులతో వినూత్నంగా తీసిన సినిమాపై రాజమౌళి స్పందన

జక్కన్నకు ఏదైనా సినిమా నచ్చితే బాగుందని చెప్తారుకానీ చూడండి అని చెప్పరట... కానీ ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమా విషయంలో మాత్రం జక్కన్న చూడమని చెబుతున్నారు. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారని కూడా చెబుతున్నారు. ఏదైనా సినిమా తన ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్ళగలిగితే ఆ సినిమా ప్రభావం కనీసం 10 రోజుల పాటైనా మన మనసులపై ఉంటుందని చెబుతున్న రాజమౌళి కేరాఫ్ కంచరపాలెం అటువంటి సినిమానే అని అంటున్నారు.

 సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కథానాయకుడు రానా సమర్పిస్తున్న చిత్రమైన 'కేరాఫ్ కంచరపాలెం'లో అందరూ నూతననటీనటులే. వెంకటేశ్‌ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్‌ అగస్థి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. న్యూయార్క్‌ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమా ఇది కావటం కూడా ఒక విశేషం.

ఇప్పటికే ఈ సినిమాను ఉద్దేశించి దర్శకులు క్రిష్‌, సుకుమార్‌ మాట్లాడుతూ సినిమా తమను మరో చోటుకు తీసుకెళ్లిందని మెచ్చుకున్నారు. ఈ సినిమాను చూసిన రాజమౌళి యూనిట్‌ను ప్రశంసించారు. ఆయన మాట్లాడుతున్న వీడియోను రానా ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. కేరాఫ్ కంచరపాలెం సినిమా రాజమౌళిపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని కలిగించిందని చెప్పారు.  

More Telugu News