rasi khanna: 'ఎన్టీఆర్' బయోపిక్ లో జయప్రద పాత్ర .. రాశి ఖన్నా ఎంపిక?

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్' బయోపిక్
  • హైదరాబాద్ లో కొనసాగుతోన్న చిత్రీకరణ  
  • శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్           

'ఎన్టీఆర్' బయోపిక్ కి సంబంధించిన చిత్రీకరణ చకచకా జరిగిపోతోంది. బాలకృష్ణ తదితరులపై హైదరాబాద్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. ఇక శ్రీదేవి పాత్రకిగాను రకుల్ ను ఎంపిక చేసుకున్నారు. ఎన్టీఆర్ తో శ్రీదేవితో పాటు ఎక్కువ సినిమాలు చేసిన గ్లామరస్ హీరోయిన్ గా జయప్రద కనిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.

అందువలన 'ఎన్టీఆర్' బయోపిక్ లో జయప్రద పాత్ర కూడా కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం ఈ తరం గ్లామరస్ హీరోయిన్ల పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు, చివరిగా రాశి ఖన్నాను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. జయప్రద పాత్రకి రాశి ఖన్నా కరెక్టుగా సరిపోతుందని ఈ సినిమా యూనిట్ భావిస్తోందట. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు.  

More Telugu News