ntr: 'ఎన్టీఆర్' బయోపిక్ లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు క్యారెక్టర్లో ఎవరంటే..!

  • దగ్గుబాటి పాత్రను పోషించనున్న భరత్ రెడ్డి
  • పలు చిత్రాల్లో నటించిన భరత్
  • శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'ఎన్టీఆర్'

నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో 'ఎన్టీఆర్' సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషిస్తుండటమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో చంద్రబాబు పాత్రలో రానా, బసవతారకం పాత్రలో విద్యాబాలన్, నారా భువనేశ్వరి పాత్రలో మంజిమ మోహన్ నటిస్తున్నారు.

ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర కోసం భరత్ రెడ్డిని ఎంపిక చేశారు. పలు చిత్రాల్లో భరత్ రెడ్డి నటించాడు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రాశిఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటిలు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

More Telugu News