Shatrughan Sinha: వాజ్‌పేయి మృతితో అనాధగా మారా: శత్రుఘ్నసిన్హా

  • ఆయన నాకు తండ్రి సమానులు 
  • ఇప్పుడు ఒంటరి వాడినయ్యా
  • నాకు రాజకీయాల్లో శిక్షణనిచ్చిన గురువు ఆయనే 

బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఇప్పుడు తాను ఒంటరినయ్యానని బాధపడుతున్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి మరణంతో తాను అనాధగా మారానన్న భావన కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి సమానులు, అత్యంత గౌరవనీయులు, సరైన మార్గంలో నడిపించిన వ్యక్తిని కోల్పోయానని చెప్పిన శత్రుఘ్నసిన్హా.. వాజ్‌పేయి అభిమానులందరికీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

వాజ్‌పేయితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన నుంచి మంచి రాజకీయాలను నేర్చుకున్నానని, రాజకీయాల్లో శిక్షణ తీసుకోవాలని నానాజీ దేశ్‌ముఖ్ నన్ను వాజ్‌పేయీ, అద్వానీల వద్దకు పంపించారని అన్నారు. వారిరువురూ నాపై ప్రేమ కురిపించారని, తనకు ఎన్నో విషయాలు చెప్పి సరైన మార్గం లో నడవాలని బోధించారన్నారు.

  1999లో చారిత్రాత్మక బస్సు యాత్రలో వాజ్ పేయితో పాటు తాను కూడా భాగస్వామి కావటం సంతోషం కలిగించిన సంఘటన అని చెప్పిన సిన్హా వాజ్‌పేయిని ‘యుగపురుష్’‌ అంటూ అభివర్ణించారు. కాగా, వాజ్‌పేయి క్యాబినెట్ లో సిన్హా మంత్రిగా పని చేశారు.

More Telugu News