China: చైనా కోసం రహస్య ప్రాజెక్ట్ పై గూగుల్ ఉద్యోగుల నిరసన

  • చైనా కోసం గూగుల్ రహస్య ప్రాజెక్ట్  
  • 1400 మంది ఉద్యోగుల సంతకాలతో నిరసన లేఖ  
  • తాము దేనిని అభివృద్ధి చేస్తున్నామో చెప్పాలని డిమాండ్

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌ చైనా కోసం ఓ రహస్య ప్రాజక్టును చేబడుతున్నట్టు ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ఆ సంస్థలోని వందలాది ఉద్యోగులు తీవ్రంగా స్పందించారు. యాజమాన్యం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఓ లేఖను రాశారు. దీనిపై పనిచేసేందుకు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ లేఖపై సుమారు 1400 మంది ఉద్యోగులు సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సంస్థ మరింత పారదర్శకంగా వ్యవహరించాలని, రహస్య ప్రాజెక్ట్ పై వివరణ ఇవ్వాలని, అసలు తాము దేనిని అభివృద్ధి చేస్తున్నామో తెలుసుకోవాల్సిన అవసరం తమకు ఉందని ఉద్యోగులు ఆ లేఖలో పేర్కొన్నారు.

More Telugu News