Aadi: హైదరాబాదులో 'బుర్రకథ' మొదలుపెట్టిన ఆది!

  • 'ప్రేమకావాలి' సినిమాతో హీరోగా పరిచయం 
  • ఇటీవలి కాలంలో విజయాలకు దూరం 
  • డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో బుర్రకథ 

ప్రముఖ నటుడు సాయికుమార్ తనయుడిగా, 'ప్రేమ కావాలి' చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టి, తొలిచిత్రంతోనే హిట్ సాధించిన హీరో ఆది, ఈ మధ్య చేసిన 'సుకుమారుడు', 'శమంతకమణి', 'నెక్స్ట్ నువ్వే' చిత్రాలు నిరాశ పరిచాయి. ఈ క్రమంలో ఇప్పుడు 'బుర్రకథ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. సాయికార్తీక్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో ప్రారంభమైంది. 

More Telugu News