priyanka chopra: ప్రియాంక చోప్రా, నిక్ జొనాలస్ ల ఎంగేజ్ మెంట్.. సాయంత్రం పార్టీ?

  • ముంబైలోని ప్రియాంక ఇంట్లో పూజలు
  • సాయంత్రం ఎంగేజ్ మెంట్ పార్టీ ఇవ్వనున్న ప్రియాంక, నిక్
  • ఇప్పటికే ముంబై చేరుకున్న నిక్ తల్లిదండ్రులు

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ లు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వారి ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాజనిత వార్తలన్నింటికీ నేడు ఈ జంట ఫుల్ స్టాప్ పెట్టనున్నట్టు సమాచారం.

ఈ సాయంత్రం ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో తమ కుటుంబసభ్యులకు, స్నేహితులకు ప్రియాంక పార్టీ ఇవ్వనున్నట్టు బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం కోసం నిక్ తల్లిదండ్రులు కూడా ఇప్పటికే ముంబై చేరుకున్నారు. దీనికి తోడు, ప్రియాంక ఇంటిని డెకరేట్ చేయడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తోంది.

ఈ ఉదయం ప్రియాంక ఇంట్లో పూజలు నిర్వహించినట్టు సమాచారం. పూజాకార్యక్రమం అనంతరం విందు కార్యక్రమం, సాయంత్రం ఎంగేజ్ మెంట్ పార్టీ ఉన్నట్టు ప్రియాంక సన్నిహితులు చెబుతున్నారు.

More Telugu News