Goosebumps 2: Haunted Halloween: పుస్తకంలోని దయ్యాలు బయటకు వచ్చేస్తున్నాయ్!: 'గూస్ బంప్స్ 2' ట్రైలర్ విడుదల

  • ఆకట్టుకుంటున్న ట్రైలర్
  • దయ్యాలతో పిల్లల పోరాటం
  • అక్టోబర్ 12న సినిమా రిలీజ్ కు సన్నాహాలు

అమెరికాలో ఓ రచయిత. ఆయన దగ్గరో మ్యాజిక్ టైప్ రైటర్. ఈ టైప్ రైటర్ తో ఏది రాసినా దానికి ప్రాణం వచ్చేస్తుంది. దీంతో ఆయన చాలా భయంకరమైన జంతువులు, జీవులను తయారుచేస్తాడు. చివరికి వాటితో డెలావేర్ పట్టణంలోని అమాయకుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడటంతో వాటిని ఓ పుస్తకంలో బంధించేస్తాడు. 2015లో వచ్చిన కామెడీ-హర్రర్ చిత్రం ‘గూస్ బంప్స్’ స్టోరీ ఇది. లాబ్ లెట్టర్ మాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.

తాజాగా అరిశాండల్ దర్శకత్వంలో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ‘గూస్ బంప్స్-2 ది హంటెడ్ హాలోవీన్’ పేరుతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను నిర్మాతలు విడుదల చేశారు. ముగ్గురు పిల్లలు ఈ భయంకర జంతువులు, భూతాలు దాగిన పుస్తకాన్ని తెరవడంతో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. తోడేలు మనిషి, దయ్యాలు, మనుషులపై దాడిచేసే జెల్లీ బేర్ లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. ఈ ముగ్గురు పిల్లలు దయ్యాలు, భయంకరమైన జంతువులతో పోరాడుతున్న సీన్లు సూపర్బ్ గా ఉన్నాయి.

ఈ సినిమాను అక్టోబర్ 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సోనీ పిక్చర్ యానిమేషన్, కొలంబియా పిక్చర్స్, ఒరిజినల్ ఫిల్మ్ సంస్థలు దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రచయిత ఆర్.ఎల్.స్టైన్ రాసిన గూస్ బంప్స్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


More Telugu News