modi: ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని మోదీ.. ఎటు చూసినా వరద నీరే.. వీడియో చూడండి

  • కేరళలో వరద బీభత్సాన్ని పరిశీలించిన మోదీ
  • చనిపోయినవారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా
  • తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 50 వేలు

భారీ వరదలతో అతలాకుతలమైన కేరళలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం సర్వే నిర్వహించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించలేదు. దీంతో, కేరళ గవర్నర్, సీఎంలతో ముందుగా ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత, ప్రతికూల పరిస్థితుల్లోనే ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద నీటిలో మునిగిపోయిన పట్టణాలు, గ్రామాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వరదల వల్ల చనిపోయివారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 50వేలు ఇస్తామని తెలిపారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారు. వరదలతో విలవిల్లాడుతున్న కేరళకు తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ఇస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఇది ఇంతకు ముందు ప్రకటించిన రూ. 100 కోట్లకు అదనం.

More Telugu News