vibhav raut]: బాంబులతో దొరికిపోయిన హిందుత్వవాదికి మద్దతుగా మహారాష్ట్రలో ర్యాలీ!

  • మహారాష్ట్రలో బాంబు పేలుళ్లకు ముగ్గురి కుట్ర
  • పక్కా నిఘాతో అరెస్ట్ చేసిన ఏటీఎస్ అధికారులు
  • వారికి మద్దతుగా హిందూ సంఘాల ర్యాలీ

బాంబులు, భారీ ఎత్తున గన్ పౌడర్ కలిగి ఉండటంతో వైభవ్ రౌత్ అనే వ్యక్తితో పాటు మరో ఇధ్దరిని కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) అరెస్ట్ చేసింది. స్థానికంగా ఓ గోరక్ష సంస్థను నడుతుపుతున్న రౌత్ సనాతన్ సంస్థాన్ అనే అతివాద హిందుత్వ సంస్థలో సభ్యుడిగా ఉన్నాడు. రౌత్ వ్యవహారంపై కొన్నిరోజులుగా నిఘా పెట్టిన అధికారులు ఆగస్టు 10న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ బాంబులతో మహారాష్ట్రలో పేలుళ్లకు రౌత్ కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో రౌత్ ను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ కొన్ని స్థానిక హిందూ సంస్థలు శుక్రవారం ర్యాలీ నిర్వహించాయి. దాదాపు 2,000 మంది ప్రజలు మహారాష్ట్ర ఏటీఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సొపారా గ్రామం నుంచి నల్లసొపరా రైల్వే స్టేషన్ వరకూ ర్యాలీలో పాల్గొన్నారు. రౌత్ తో పాటు అరెస్టయిన శరద్ కలాస్కర్, సుధాన్వలు స్వాతంత్ర్య దినోత్సవం, బక్రీద్ సందర్భంగా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని ఏటీఎస్ అధికారులు తెలిపారు.

More Telugu News