venkatesh: బ్యాంకాక్ వెళుతున్న 'ఎఫ్ 2' యూనిట్!

  • షూటింగు దశలో 'ఎఫ్ 2'
  • తొలి షెడ్యూల్ పూర్తి 
  • జనవరి 12వ తేదీన రిలీజ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా రూపొందుతోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. వెంకటేశ్ సరసన తమన్నా నటిస్తుండగా, వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా, ఇటీవలే హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ ను బ్యాంకాక్ లో ప్లాన్ చేశారు .. త్వరలోనే ఈ సినిమా టీమ్ అక్కడికి చేరుకోనుంది. 20 రోజుల పాటు అక్కడ ప్రధానమైన పాత్రలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. సంక్రాంతికి గట్టిపోటీ ఉన్నప్పటికీ, ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడం విశేషం.    

More Telugu News