Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రకుల్ ప్రీత్ కి చిన్న బ్రేక్ కావాలట! 
  • 'ఎన్టీఆర్' పెద్దల్లుడి పాత్రధారి ఎంపిక 
  • మేకప్ లేకుండా కనిపించనున్న రష్మిక

*  ఇకపై సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను.. అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.  ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తున్న రకుల్ త్వరలో 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగులో జాయిన్ కానుంది. ఈ సందర్భంగా చెబుతూ, ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక, చిన్న బ్రేక్ తీసుకుంటాను. ఆ తర్వాత మంచి సత్తా వున్న పాత్రలతో కూడిన సినిమాలు చేయాలనుకుంటున్నాను' అని చెప్పింది.  
*  క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో మరో ఆర్టిస్టు కూడా జాయిన్ అవుతున్నాడు. 'దూకుడు', 'అత్తారింటికి దారేది' వంటి చిత్రాలలో నటించిన డాక్టర్ భరత్ రెడ్డి ఈ సినిమాలో కీలక పాత్రయిన ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా నటించడానికి ఎంపికయ్యాడు.
*  తాజాగా విడుదలై సక్సెస్ సాధించిన 'గీత గోవిందం' చిత్రం ద్వారా పేరు తెచ్చుకున్న కథానాయిక రష్మిక మందన తన తదుపరి చిత్రాన్ని కూడా విజయ్ దేవరకొండతోనే చేస్తున్న సంగతి విదితమే. 'డియర్ కామ్రేడ్' పేరిట రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మేకప్ లేకుండా నేచురల్ గా కనిపిస్తుందట.

More Telugu News