Kerala: నిండు గర్భిణిని ఎయిర్ లిఫ్ట్ చేసిన నేవీ.. ఆసుపత్రిలో పండంటి బిడ్డ జననం!

  • వరదల్లో చిక్కుకున్న గర్భిణి
  • హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించిన నేవీ సిబ్బంది
  • ఆసుపత్రిలో ప్రసవం

కేరళ వరదల్లో చిక్కుకున్న ఓ నిండు గర్భిణిని హెలికాప్టర్ ద్వారా రక్షించి, ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెను ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత కొన్ని రోజులుగా కేరళను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి వందల్లో ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. రోడ్డు, రైలు, జల, ఆకాశ మార్గాలు స్తంభించాయి. దీంతో ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు.

రంగంలోకి దిగిన ఆర్మీ, నేవీ అధికారులు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రసవానికి సిద్ధంగా ఉన్న నిండు గర్భిణిని గుర్తించిన నేవీ సిబ్బంది వెంటనే ఆమెను ఇంటిపైకి చేర్చి హెలికాప్టర్ సాయంతో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మహిళను రక్షించి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఆసుపత్రిలో బిడ్డతో కలిపి ఉన్న ఫొటోలు కూడా హల్‌చల్ చేస్తున్నాయి.

More Telugu News