Sun: సూర్యుడి అధ్యయనానికి ఇస్రో శాటిలైట్ ఆదిత్య-ఎల్ 1

  • సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో పంపబోతున్న శాటిలైట్ ఆదిత్య-ఎల్1
  •  2019-2020లలో ఈ ఆదిత్య-ఎల్1 శాటిలైట్‌ను లాంచ్ చేయాలని ఇస్రో భావన
  • కరోనాతోపాటు సూర్యుడి ఫొటో స్పియర్, క్రోమోస్పియర్‌ల అధ్యయనం

ఆదిత్య-ఎల్1.... తొలిసారి సూర్యుడి అధ్యయనానికి మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చేయబోతున్న ప్రయోగం. సూర్యుడి బాహ్య వాతావరణం అయిన కరోనాపై అధ్యయనం చేయాలనే భావనతో ఆదిత్య -ఎల్1 శాటిలైట్‌ను పంపించడానికి ఇస్రో ప్రణాళిక రూపొందిస్తోంది. మానవ చరిత్రలో సూర్యుడికి అత్యంత చేరువగా వెళ్లే పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ఈమధ్యే నాసా లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఇస్రో కూడా భూమికి 15 లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ఆదిత్య-ఎల్1 శాటిలైట్‌ ద్వారా సూర్యుడిపై సమగ్ర అధ్యయనం చెయ్యనుంది.

దీని కోసం ఈ శాటిలైట్ ఆరు పేలోడ్లను నింగిలోకి మోసుకెళ్లనుంది. శాటిలైట్‌లో పంపుతున్న అదనపు పేలోడ్స్ కరోనాతోపాటు సూర్యుడి ఫొటో స్పియర్, క్రోమోస్పియర్‌లను అధ్యయనం చేయనున్నాయి. మొదట ఈ శాటిలైట్ ను హాలోఆర్బిట్ అనే కక్ష్య లోనికి పంపిస్తారు. సూర్యుడు-భూమి వ్యవస్థలోని హాలోఆర్బిట్ లాగ్రేంగియన్ పాయింట్ 1లో ఉండే శాటిలైట్ సూర్యుడిని ఎలాంటి గ్రహణాలు లేకుండా చూసే వీలుంటుంది.

అందుకే ఇస్రో ఈ మిషన్‌ను ఆదిత్య-1 నుంచి ఆదిత్య-ఎల్1గా మార్చింది. 2019-2020లలో ఈ ఆదిత్య-ఎల్1 శాటిలైట్‌ను లాంచ్ చేయాలని ఇస్రో భావిస్తోంది. పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ ద్వారా ఏపీలోని శ్రీహరికోట నుంచి దీనిని నింగిలోకి పంపనుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇస్రో మరో కీలక మైలు రాయిని దాటినట్టవుతుంది.  

More Telugu News