charan: పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చరణ్!

  • సెట్స్ పై బోయపాటి తాజా చిత్రం 
  • చరణ్ సరసన కైరా అద్వాని 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు

బోయపాటి దర్శకత్వంలో చరణ్ తన తాజా చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో వుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుండటంతో, చరణ్ పాత్ర ఎలా వుండనుందనే ఆసక్తి అభిమానుల్లో తలెత్తుతోంది. ఈ సినిమాలో చరణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం.

చరణ్ పాత్రను బోయపాటి చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడట. తను ఇంతవరకూ చేయని పాత్ర కావడంతో, ఈ పాత్ర పట్ల చాలా ఆసక్తిగా చరణ్ వున్నాడని అంటున్నారు. బోయపాటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు .. ఇక చరణ్ కూడా మాస్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో వున్న హీరో. అందువలన ఈ సినిమాపై అందరిలోను అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి మరి. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. 

More Telugu News