Kerala: కేరళలో అన్ లిమిటెడ్ కాల్స్, డేటాని ప్రకటించిన టెలికాం సంస్థలు

  • కేరళని ముంచెత్తిన వరదలు 
  • వారం పాటు ఉచిత కాల్స్, డేటాని ప్రకటించిన టెలికాం సంస్థలు
  • నిరాశ్రయులు అయిన ప్రజలు  

కేరళలో భారీ వర్షాలు ముంచెత్తడంతో తమ వినియోగదారుల కోసం టెలికాం సంస్థలు ముందుకొచ్చాయి. ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్, జియో, బీఎస్ఎన్ఎల్ కేరళలోని తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం వారం రోజుల పాటు వాయిస్ కాల్స్, మొబైల్ డేటాని ప్రకటించాయి. ఎయిర్ టెల్, వోడాఫోన్ లు 1 జీబీ డేటా, రూ.30 టాక్ టైంని క్రెడిట్ చేయగా, ఐడియా రూ.10 తో పాటు 1 జీబీ డేటాని క్రెడిట్ చేసింది.

అలాగే, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉచిత డేటాతో పాటు ఒక రోజులో మొదటి 20 నిమిషాలు ఉచిత కాల్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాగా, జియో మాత్రం వారం రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్, డేటాని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే, భారీ వర్షాల కారణంగా ఎందరో నిరాశ్రయులు కాగా వరదలకు 97 మంది చనిపోయారు.

నోట్: ఉచిత బెనిఫిట్స్ పొందాలంటే ఐడియా కస్టమర్లు తమ మొబైల్ నుండి *150*150# నెంబర్ కి డయల్ చేయాలి. అలాగే, వోడాఫోన్ కస్టమర్లు అయితే తమ మొబైల్ నుండి *130*1# లేదా 'CREDIT' అని టైప్ చేసి 144 నెంబర్ కి ఎస్ఎంఎస్ చేయాలి. (ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, జియో ఉచిత బెనిఫిట్స్ ని ఆటోమేటిక్ గా క్రెడిట్ చేస్తున్నాయి). 

More Telugu News