Vajpayee: వాజ్ పేయికి వినికిడి శక్తి, జ్ఞాపక శక్తి పోవడానికి కారణం ఏమిటంటే..!

  • 9 సంవత్సరాలుగా ప్రజా జీవితానికి దూరం
  • ఇంటికే పరిమితమైన వాజ్ పేయి
  • మెదడులో దెబ్బతిన్న నరాలతో వినేశక్తి కోల్పోయిన అటల్ జీ

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గడచిన 9 సంవత్సరాలుగా ప్రజా జీవితానికి దూరంగా గడుపుతూ, ఇంటికి మాత్రమే పరిమితమై, వినికిడి శక్తి, జ్ఞాపక శక్తి కోల్పోయిన పరిస్థితుల్లో తన చివరి నాలుగైదేళ్లూ దత్త పుత్రిక సంరక్షణలో గడిపారన్న సంగతి తెలిసిందే. 2009లో ఆయనకు వచ్చిన గుండెపోటు, ఓ మహానేతను ప్రజలకు, కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలకు దూరం చేసింది. గుండెపోటు తరువాత ఆయన మెదడులోని కొన్ని నరాలు దెబ్బతిన్నాయి. చెవి నరాలకు ఇన్ఫెక్షన్ సోకింది.

దీంతో ఆయన క్రమంగా వినికిడి శక్తిని కోల్పోయారు. ఆ దశలో దాదాపు రెండేళ్ల పాటు తన పార్టీ నేతలను కలుస్తూనే ఉన్నారు. ఆ తరువాత ఆయనకు జ్ఞాపకశక్తి మందగించడం మొదలైంది. దీనికి కూడా గుండెపోటే కారణం. దీంతో చుట్టూ ఉన్నవారిని గుర్తు పట్టలేని పరిస్థితికి ఆయన వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన ఇల్లు దాటి బయట కాలుమోపిన సందర్భాలు లేవు. ఆరేళ్ల క్రితం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, వాజ్ పేయికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లిన వేళ, మన్మోహన్ నమస్కరిస్తుంటే, శూన్యంలోకి చూస్తున్న ఆయన ఫొటో అప్పట్లో ఆయన పరిస్థితిని ప్రపంచానికి కళ్లకు కట్టింది.

More Telugu News