shivathmika: తెరపైకి రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక

  • హీరోగా రాజశేఖర్ కి మంచి క్రేజ్ 
  • సినీరంగంలోకి పెద్ద కూతురు శివాని
  • అక్కబాటలోనే వెళ్లనున్న శివాత్మిక

తెలుగు తెరపై యాంగ్రీ యంగ్ మేన్ గా రాజశేఖర్ కి ఎంతో క్రేజ్ వుంది. ఇక నటిగానే కాకుండా దర్శక నిర్మాతగా జీవితకి మంచి పేరుంది. ఈ ఇద్దరూ కూడా తమ పెద్ద కూతురు శివానిని కథానాయికగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగులో అడవి శేష్ జోడీగా శివాని ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ఇక తమిళంలోను శివాని కథానాయికగా పరిచయం కానుంది.

ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక కూడా నటన వైపే ఆసక్తిని చూపుతోందట. ఈ విషయాన్ని జీవిత రాజశేఖర్ స్వయంగా చెప్పారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక స్కూల్ ను ఏర్పాటు చేసి, ఆ స్కూల్ నిర్వహణ బాధ్యతలను శివాత్మికకి అప్పగించాలని రాజశేఖర్ భావించారట. కానీ అక్క మాదిరిగానే శివాత్మిక కూడా నటనపట్ల ఆసక్తిని చూపుతుండటంతో, ఆ దిశగానే ఆమెను ప్రోత్సహించేందుకు జీవిత రాజశేఖర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.     

More Telugu News