vajpayee: ఇందిర మమ్మల్ని ఇప్పుడు చాలా ప్రేమగా చూస్తున్నారు!: ఓటమిలోనూ జోకులేయడం ఆపని వాజ్ పేయి

  • 1971 లోక్ సభ ఎన్నికల్లో దెబ్బతిన్న జన్ సంఘ్
  • ఇందిర వ్యవహారశైలిపై ప్రశ్నించిన అప్పా ఘటాటే
  • వ్యంగ్యంగా జవాబిచ్చిన రాజకీయ భీష్ముడు

అది 1971 లోక్ సభ ఎన్నికలు. గరీభీ హఠావో (పేదరికాన్ని తరిమేద్దాం) అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లిన ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 352 సీట్లలో ఘన విజయం సాధించింది. అయితే 1967 ఎన్నికల్లో 35 లోక్ సభ సీట్లు గెలిచి మంచి ప్రదర్శన చేసిన జన్ సంఘ్.. మరో ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం 22 సీట్లకే పరిమితమైంది.

ఈ నేపథ్యంలో ఆర్సెస్సెస్ నేత అప్పా ఘటాటేకు వాజ్ పేయి ఓసారి ఎదురుపడ్డారు. దీంతో అప్పా ఘటాటే ‘ఇందిరాగాంధీ ఇప్పుడు మీపట్ల ఎలా ఉన్నారు?’ అని ఆయనను అడిగారు. అయితే ఎన్నికల్లో సీట్లు కోల్పోయినా వాజ్ పేయి మాత్రం జోక్ లు వేసే అలవాటును వదులుకోలేదు. అప్పా ఘటాటే ప్రశ్నకు వెంటనే స్పందిస్తూ.. ‘ఏముంది? ఎన్నికల్లో 13 సీట్లు పోగొట్టుకున్నాక ఇప్పుడు ఆమె (ఇందిర) మావైపు మరింత అభిమానంతో చూస్తున్నారు’ అని చమత్కరించారు. దీంతో ఇద్దరూ పకపకా నవ్వుకున్నారు.

More Telugu News