nehru: తలక్రిందులుగా చూడొద్దు నెహ్రూజీ... వాజ్ పేయి జోక్ కు పడీపడీ నవ్విన నెహ్రూ

  • జన్ సంఘ్ నేతలపై నెహ్రూ గుస్సా
  • వాక్పటిమతో నెహ్రూ కోపాన్ని పోగొట్టిన వాజ్ పేయి
  • విదేశాంగ విధానంలో నెహ్రూనే తన హీరో అన్న మాజీ ప్రధాని

స్వతంత్ర భారత తొలి ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు స్వీకరించిన కాలమది. 1951-52 కాలంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలోని జన్ సంఘ్ పార్టీ (ఆ తర్వాతి కాలంలో బీజేపీగా మారింది) 3 సీట్లు గెలుచుకుంది. దేశ విభజన గాయాలు అప్పటికీ మానకపోవడంతో మతతత్వ వాఖ్యలు చేసే నేతలపై నెహ్రూ తీవ్రంగా స్పందించేవారు. హిందుత్వ సిద్ధాంతాలు పాటించే జన్ సంఘ్ నేతలపై కూడా నెహ్రూ కోపంగా ఉండేవారు.

ఓ సమావేశం సందర్భంగా పండిట్ నెహ్రూ జన్ సంఘ్ ను విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది అప్పుడే లోక్ సభ కు ఎన్నికైన వాజ్ పేయికి తెలిసింది. దీంతో వాజ్ పేయి స్పందిస్తూ.. ‘పండిట్ నెహ్రూజీ రోజూ శీర్షాసనం వేస్తారని నాకు తెలుసు. ఆయన్ను అలాగే వేయనివ్వండి. కానీ దయచేసి ఆ శీర్షాసనంతోనే నా పార్టీ జెండాను చూడొద్దని ఆయనకు మనవి చేసుకుంటున్నాను’ అని అన్నారు. తెల్లవారి ఈ వార్తను చదివిన నెహ్రూ అక్కడే పడీపడీ నవ్వారు. ఇలా తీవ్రంగా విమర్శించే ప్రత్యర్థులను సైతం తన వాక్పటిమతో వాజ్ పేయి కట్టిపడేసేవారు. అంతేకాదు, విదేశాంగ విధానంలో నెహ్రూనే తనకు ఆదర్శమని వాజ్ పేయి చాలాసార్లు చెప్పుకున్నారు.

More Telugu News