vaj payee: భారత రాజకీయాల్లో ఓ ధృవ తార రాలిపోయింది: అమిత్ షా

  • సాహితీ శిఖరం నేలకొరిగింది
  • గొప్ప జర్నలిస్టును కోల్పోయాం
  • పీడితుల పక్షాన పోరాడిన గొంతు మూగబోయింది

ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి నేరుగా వాజ్ పేయి నివాసానికి పార్థివదేహం చేరుకుంది. వాజ్ పేయి పార్థివదేహాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సందర్శించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత రాజకీయాల్లో ఓ ధృవతార రాలిపోయిందని విచారం వ్యక్తం చేశారు.

సాహితీ శిఖరం నేలకొరిగిందని, గొప్ప జర్నలిస్టును కోల్పోయామని, చట్టసభల్లో పీడితుల పక్షాన పోరాటం చేసిన గొంతు మూగబోయిందని అన్నారు. వాజ్ పేయి మృతితో కోట్లాది మంది యువకులు తమ ప్రేరణను కోల్పోయారని, ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని అన్నారు. జనసంఘ్, బీజేపీ అభివృద్ధిలో వాజ్ పేయి ఎంతో కృషి చేశారని, తమకు ఆయన మార్గ నిర్దేశం చేశారని, అటల్ ఏం చెప్పినా, ఏం చేసినా దేశ హితం కోసమే ఉండేదని కొనియాడారు.

More Telugu News