vajpayee: రేపు యమునా నది ఒడ్డున వాజ్ పేయి అంత్యక్రియలు

  • ‘యమున’ ఒడ్డునే నిర్మించనున్న రాష్ట్రీయ స్మృతి స్థల్ 
  • దీని నిర్మాణానికి 1.5 ఎకరాల భూమి కేటాయింపు
  • ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయం

యమునానది ఒడ్డున వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా, ఆ నది ఒడ్డునే రాష్ట్రీయ స్మృతి స్థల్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీని నిర్మాణం నిమిత్తం పాత నిబంధనల మార్పు కోసం అవసరమైన ఆర్డినెన్స్ ను తీసుకురానున్నట్టు సమాచారం. రాష్ట్రీయ స్మృతి స్థల్ నిర్మాణానికి గాను విజయ్ ఘాట్ లో 1.5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వారం రోజులు సంతాప దినాలు 

కాగా, వాజ్ పేయి మృతిపై కేంద్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్టు పేర్కొంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు కేంద్రం సమాచారం పంపింది. కాగా, రేపు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

More Telugu News