vajpayee: నాడు మా ఆసుపత్రిని ప్రారంభించిన మహానుభావుడు వాజ్ పేయి: నందమూరి బాలకృష్ణ

  • మహోన్నత రాజకీయ నేతను కోల్పోవడం బాధాకరం
  • జాతీయస్థాయి రాజకీయాలకు తీరని లోటు 
  • మా నాన్నతో వాజ్ పేయికి మంచి అనుబంధం ఉండేది

భారత మాజీ ప్రధాని వాజ్ పేయి మృతిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. మహోన్నతమైన రాజకీయ నేతను కోల్పోవడం చాలా బాధాకరమని, జాతీయస్థాయి రాజకీయాలకు తీరని లోటని అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రి గురించి బాలకృష్ణ ప్రస్తావించారు.

‘మా బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని 22 జూన్, 2000 సంవత్సరంలో మహానుభావుడు వాజ్ పేయి గారు ప్రారంభించారు. నాన్న గారితో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. నాడు ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి టీడీపీ క్రియాశీలకంగా పని చేసింది. నాడు దేశ ప్రధానిగా సేవలందిస్తూ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న సమర్ధుడు ఆయన’ అని బాలకృష్ణ కొనియాడారు. 

More Telugu News