Maruthicar: మారుతీ ధరలకు రెక్కలు ... రూపాయి పతనమే కారణం!

  • తమ వాహనాలపై ధరలను పెంచిన మారుతీ సుజుకి 
  • వివిధ మోడళ్ళపై 6,100 రూపాయల వరకు ధరల పెంపు 
  •  ఇతర దిగ్గజ కంపెనీలు కూడా ఇప్పటికే పెంచాయి

వస్తువుల ధరలు, పంపిణీ వ్యయాలు పెరగటం, విదేశీమారకంలో రూపాయి విలువ పతనం కావటం వంటి అంశాల ప్రభావం ఆటోమొబైల్స్ రంగంపై పడింది. దేశంలోనే అతిపెద్ద వాహన తయారీదారు మారుతీ సుజుకి తన ధరల పెంపును ప్రకటించింది. తమ కంపెనీ తయారు చేస్తున్న అన్ని మోడళ్ళపైనా వాహనాల ధరలను గరిష్టంగా పెంచింది. 6,100 రూపాయల వరకు ధరల పెంపు ఉంటుందని మారుతీ సుజుకీ  తెలిపింది. ఈ ధరల పెంపు వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొంది.

ఉత్పత్తి ఖర్చులు, రవాణా వ్యయం పెరగటంతో ఒక్క మారుతి సుజుకీనే కాకుండా ప్రముఖ అన్ని వాహన తయారీ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. వాహనాల తయారీలో ఇతర దిగ్గజ కంపెనీలైన మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా, టాటా మోటార్స్‌ కంపెనీలు ఇప్పటికే తమ ధరలను పెంచగా, తాజాగా మారుతీ సుజుకీ తన ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది.

More Telugu News