vijay devarakonda: దుమ్మురేపేసిన 'గీత గోవిందం' తొలిరోజు వసూళ్లు

  • నిన్ననే విడుదలైన 'గీత గోవిందం'
  • తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల జోరు
  • అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్    

విజయ్ దేవరకొండకి యూత్ లో విపరీతమైన క్రేజ్ వుంది. దానికి తోడు 'గీత గోవిందం' సినిమాపై ఫస్టు నుంచి అందరిలోనూ ఆసక్తి వుంది. ఈ సినిమా పోస్టర్స్ దగ్గర నుంచి మొదలైన అంచనాలు .. టీజర్ .. ట్రైలర్ .. సాంగ్స్ తో మరింత పెరిగాయి. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. భారీ ఓపెనింగ్స్ ను సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున ఈ సినిమా 5.80 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే తొలిరోజున 9.66 కోట్ల షేర్ ను వసూలు చేసింది. సెలవు రోజునే విడుదల ప్లాన్ చేయడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. ఇక చిరంజీవి .. రాజమౌళి .. మహేశ్ బాబు వంటి వారు చూసి చాలా బాగుందంటూ స్పందించడం ఈ సినిమాకి కలిసొచ్చే మరొక అంశంగా చెప్పుకోవచ్చు. మౌత్ పబ్లిసిటీ కూడా జోరుగానే ఉండటంతో, వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరగవచ్చని అంటున్నారు. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో భారీ విజయం చేరిపోయినట్టేననే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News