Priyanka chopra: ప్రియాంకకు ప్రియుడి ఎంగేజ్మెంట్ రింగ్.. విలువ కోటికి పైమాటే!

  • ప్రియాంకా చోప్రాకు డైమండ్ రింగ్ తొడిగిన నిక్ 
  • ఇండియన్ కరెన్సీలో కోటి రూపాయలకు పైగా విలువ 
  • ఒక రోజంతా కస్టమర్లను రాకుండా ఆపిమరీ రింగ్ సెలక్ట్ చేసిన నిక్ 
  • త్వరలో ఇండియాలో ప్రియాంక పార్టీ ... నిక్ తో పెళ్లి ప్రకటన

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకచోప్రా ఇప్పుడు పట్టలేని సంతోషంలో ఉంది. దానికి కారణం ప్రియుడు నిక్ జోనాస్ ప్రజెంట్ చేసిన ఉంగరమట! హాలీవుడ్ నటుడు, గాయకుడు అయిన నిక్ జోనాస్ ను ప్రియాంక పెళ్లి చేసుకోనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల అమెరికాలో సన్నిహితుల మధ్య జరిగిన నిశ్చితార్ధంలో ప్రియాంకా చోప్రాను విలువైన ఎంగేజ్మెంట్ రింగ్ తో ప్రియుడు ఆశ్చర్యానికి గురి చేశాడట. మరి, ఆ ఉగంరం ఖరీదు తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.

 నిక్ జోనాస్ ప్రియాంక చోప్రా వేలికి తొడిగిన ఉంగరం విలువ రెండు లక్షల డాలర్లు..  మన కరెన్సీలో చెప్పాలంటే, కోటి రూపాయలకు పై మాటే. అంతటి విలువైన ఉంగరాన్ని ప్రియాంక వేలికి తొడిగి ఆమెను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు నిక్. కాబోయే శ్రీమతికి బహుమతిగా ఇచ్చే ఈ విలువైన ఉంగరం కొనుగోలు చెయ్యటానికి లండన్‌లోని ప్రముఖ అమెరికన్‌ జ్యువెలరీ సంస్థ టిఫనీ అండ్‌ కోకు వెళ్ళిన నిక్ జోనాస్ ఒక రోజంతా ఆ షాప్ లోకి కస్టమర్లు ఎవరూ రాకుండా షాప్ మూసివేయించి మరీ ఈ ఉంగరాన్ని సెలెక్ట్ చేసి కొన్నాడట.

నిక్ ఒక్కడే షాప్ లో ఉన్న అన్నిటినీ పరిశీలించి ది బెస్ట్ అనిపించిన ఈ ఉంగరాన్ని ప్రియాంక వేలికి తొడిగి తన ప్రేమను వ్యక్తం చేశాడు. దీంతో ఉబ్బితబ్బిబ్బైన అమ్మడు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా తన నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీకి హాజరై, తన పెళ్లి గురించి ఆ పార్టీలో ప్రకటించి నిక్ వేలికి తొడిగిన ఉంగరాన్ని చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఉంగరంలో నాలుగు క్యారెట్ల మేలిరకం వజ్రాలు వున్నాయట.

ఈ చూడముచ్చటైన డైమండ్ రింగ్ చూసి మురిసిపోతున్న అమ్మడు త్వరలోనే తన స్నేహితుల కోసం ఇండియాలో కూడా ఘనంగా పార్టీ ఇవ్వబోతోంది. ఆగస్ట్ 18న జరిగే గ్రాండ్ పార్టీకి నిక్ కుటుంబ సభ్యులు కూడా ఇండియాకి రాబోతున్నారు. వారి కోసం ముంబై లోని ఫైవ్ స్టార్ హోటల్ ను బుక్ చేసి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు నిక్ తో పెళ్లిపై మీడియాకు ప్రకటన ఇస్తుందట ప్రియాంకాచోప్రా.

More Telugu News