vajpayee: వాజ్ పేయి చనిపోయారంటూ త్రిపుర గవర్నర్ ట్వీట్.. తర్వాత క్షమాపణలు!

  • వాజ్ పేయి ఇక లేరు అంటూ ట్వీట్ చేసిన తథాగత రాయ్
  • దుమ్మెత్తి పోసిన నెటిజన్లు
  • ట్వీట్ తొలగించి.. క్షమాపణ చెప్పిన గవర్నర్

భారత మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ చేసిన ట్వీట్ కలకలం రేపింది. 'గొప్ప వక్త, ఆరు దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో ధ్రువతారలా వెలిగిన మాజీ ప్రధాని వాజ్ పేయి ఇకలేరు. ఓం శాంతి' అంటూ ఆయన ట్వీట్ చేశారు. క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్ అయింది. దీంతో, ఆయనపై నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. ఆ తర్వాత నాలుక కరుచుకున్న తథాగత రాయ్ తన ట్వీట్ ను తొలగించారు.
'నన్ను క్షమించండి. ఓ జాతీయ టీవీ చానల్ లో వచ్చిన వార్తను చూసి నేను ట్వీట్ చేశాను. ట్వీట్ చేసే ముందు అది నిజమా, కాదా? అనే విషయాన్ని తెలుసుకుని ఉండాల్సింది. వాజపేయి గురించి ఎలాంటి అధికారిక వార్త వెలువడలేదు. నా ట్వీట్ ను తొలగించాను. క్షమించండి' అంటూ మరో ట్వీట్ చేశారు. వాజ్ పేయికి చికిత్స కొనసాగుతోందని ఎయిమ్స్ వైద్యులు ఒక బులెటిన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

More Telugu News