chaitu: సమంత .. చైతూ న్యూ మూవీ టైటిల్ ఇదేనంటూ టాక్

  • శివ నిర్వాణ నుంచి మరో సినిమా 
  • చైతూ జోడిగా సమంత 
  • త్వరలోనే సెట్స్ పైకి    

నాగచైతన్య .. సమంత కాంబినేషన్లో గతంలో 'ఏ మాయ చేశావే' .. 'ఆటో నగర్ సూర్య' ..'మనం' సినిమాలు వచ్చాయి. పెళ్లి తరువాత ఈ జోడీని తెరపై చూడాలని అభిమానులు ఆత్రుతగా వున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికీ ఒక కథ వినిపించి మెప్పించాడు దర్శకుడు శివ నిర్వాణ. 'నిన్నుకోరి' సినిమాతో దర్శకుడిగా హిట్ కొట్టిన శివ నిర్వాణతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి సమంత .. చైతూ రెడీ అవుతున్నారు.

 ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి 'మజిలీ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావలసి వుంది. ఈ సినిమాలో సమంత .. చైతూ భార్యాభర్తలుగానే కనిపించనున్నారని అంటున్నారు. సాహు గారపాటి .. హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.    

More Telugu News