Hyderabad: ఇది హైదరాబాద్ ఉడత దేశభక్తి... వైరల్ అవుతున్న ఫొటో!

  • హైదరాబాద్, కొండాపూర్ లో ఘటన
  • పిల్లలు పెట్టి వెళ్లిన జెండా వద్ద ఉడత ఆటలు
  • క్లిక్ మనిపించిన ఫొటోగ్రాఫర్

'ఉడతా భక్తి'... త్రేతాయుగం నుంచే ఈ పదం ప్రాచుర్యంలో ఉంది. వానరుల సాయంతో శ్రీరాముడు సముద్రంపై వారధి కడుతున్న వేళ, ఇసుకలో పోర్లిన ఉడుత, ఆ రాళ్ల మధ్య దాన్ని విదిలిస్తూ, వంతెన నిర్మాణానికి తనవంతు సాయం చేసింది. అప్పటి నుంచే ఈ 'ఉతతా భక్తి' పదాన్ని అందరూ వాడుతున్నారు.

అయితే, ఈ హైదరాబాద్ ఉడత, తనలోని దేశభక్తిని చూపించింది. కొందరు చిన్నారులు చిట్టి జెండాలను తాము ఆడుకుంటున్న ప్రాంతంలో ఇసుకలో గుచ్చి వెళ్లగా, పక్కనే ఉన్న చెట్టుపై నుంచి వచ్చిన ఉడుత, ఇదిగో... ఈ ఫొటోలో ఉన్నట్టుగా వందనం చేసింది. ఈ ఘటన హైదరాబాద్, శివారు ప్రాంతమైన కొండాపూర్, గౌతమి ఎన్ క్లేవ్ కాలనీలో జరిగింది. జెండా వద్దకు వెళ్లి ఉడత చేసిన విన్యాసాలను పలువురు తిలకించారు. అదే ప్రాంతంలో ఉన్న ఓ ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

More Telugu News