TTD: తిరుమలలో నేడు మహాసంప్రోక్షణ.. నేటి అర్ధరాత్రి నుంచి దర్శనం టోకెన్ల జారీ!

  • ఉదయం 10:16 గంటల నుంచి మహా సంప్రోక్షణ
  • రేపటి నుంచి యథావిధిగా ఆర్జిత సేవలు
  • ప్రత్యేక దర్శనాలు

శ్రీవారి భక్తులకు శుభవార్త. నేటి అర్ధరాత్రి నుంచి దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను తిరిగి విక్రయించనున్నారు. నేటి ఉదయం 10:16 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య తులాలగ్నంలో శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యాగశాల నుంచి కుంభాలను ఆయా దేవతలు, గోపురాల వద్దకు తీసుకెళ్లి కళావాహనం చేయనున్నారు. రాత్రి పెద్ద శేష వాహనసేవ నిర్వహిస్తారు. దీంతో ఈ క్రతువు ముగుస్తుంది.

రేపటి నుంచి యథావిధిగా శ్రీవారి ఆర్జిత సేవలు కొనసాగుతాయి. వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు ప్రవేశపెట్టనున్నారు. బుధవారం రుత్వికులు శ్రీవారి మూలవిరాట్టుకు, పరివార దేవతలకు మహాశాంతి తిరుమంజనం క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాసంప్రోక్షణలో భాగంగా ఉదయం స్వామివారి మూల విరాట్టుకు, పరివార దేవతలకు క్షీరాధివాస తిరుమంజనం చేశారు.

More Telugu News