తన జాతీయతను ప్రశ్నించిన నెటిజన్‌కు సానియా మీర్జా ఘాటు రిప్లై!

16-08-2018 Thu 07:56
  • మీ ఇండిపెండెన్స్ డే ఆగస్టు 14న కదా అన్న నెటిజన్
  • నా దేశానికి 15న అన్న సానియా
  • మరి మీదెప్పుడో అని ప్రశ్న
స్వాతంత్ర్య దినోత్సవం నాడు తన జాతీయతను ప్రశ్నించిన ఓ నెటిజన్‌కు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఘాటు రిప్లై ఇచ్చింది. ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘నా పాకిస్థానీ అభిమానులు, మిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’ అని సానియా ట్వీట్ చేసింది.

ఆమె ట్వీట్ చూసిన ఓ నెటిజన్ ‘‘మీక్కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. అయితే, మీ ఇండిపెండెన్స్ డే కూడా ఈ రోజే కదా’’ అని ట్వీట్ చేశాడు. నెటిజన్ ట్వీట్‌పై స్పందించిన సానియా.. ‘‘కాదు, నాది.. నా దేశానిది రేపు. ఈ రోజు నా భర్తది, ఆయన దేశానిది. మరి మీదెప్పుడు?.. ఇప్పటికైనా స్పష్టత వచ్చిందనుకుంటా’’ అని ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్ అయింది.