vijay devera konda: విజయ్ దేవరకొండ నుంచి ఇది అస్సలు ఊహించలేదు!: ‘గీత గోవిందం’పై రాజమౌళి ప్రశంస

  • ఈ సినిమా చూసి చాలాసేపు నవ్వుకున్నా
  • ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఈ చిత్రం విజయ్ బెస్ట్ ఛాయిస్
  • దర్శకుడు పరశురామ్ చాలా బాగా తెరకెక్కించాడు

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీత గోవిందం’ చిత్రం ఈ రోజు విడుదలైంది. మంచి టాక్ సంపాదించుకున్న ఈ చిత్రంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ సినిమా చూసి చాలాసేపు నవ్వుకున్నానని, విజయ్ దేవరకొండ నుంచి ఇది అస్సలు ఊహించలేదని రాజమౌళి అన్నారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఈ చిత్రం విజయ్ దేవరకొండ బెస్ట్ ఛాయిస్ అని, తాను ఏం చేస్తున్నాడో అతనికి స్పష్టంగా తెలుసని అన్నారు. ఈ చిత్రం సరదా సన్నివేశాలతో ఉందని, దర్శకుడు పరశురామ్ చాలా బాగా తెరకెక్కించాడని రాజమౌళి ప్రశంసించారు.

More Telugu News