Tamilnadu: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితపై బయోపిక్!

  • తెలుగు, హిందీ, తమిళ భాషల్లో బయోపిక్
  • జయలలిత పుట్టినరోజున షూటింగ్ ప్రారంభం
  • తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో బయోపిక్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నాటి నటి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను మూవీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఓ ట్వీట్ లో తెలిపారు. ఈ బయోపిక్ ను విబ్రి మీడియా నిర్మిస్తుందని చెప్పారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందించే ఈ చిత్రం షూటింగ్ ను జయలలిత పుట్టినరోజున అంటే ఫిబ్రవరి 24, 2019 నుంచి నిర్వహిస్తామని, అదే రోజు ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని అన్నారు. తమిళ చిత్రం ‘మదరాసిపట్నం’ దర్శకుడు ఏఎల్ విజయ్ ఈ బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నట్టు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. 

More Telugu News