Congress: టీఆర్ఎస్-కాంగ్రెస్ వర్గీయుల ఆందోళన..సునీతాలక్ష్మారెడ్డి కన్నీటి పర్యంతం

  • మెదక్ జిల్లా నర్సాపూర్ లో వివాదం
  • సునీత లక్ష్మారెడ్డిని పోలీస్ స్టేషన్ కు తరలించే యత్నం
  • పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

మెదక్ జిల్లా నర్సాపూర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మరోసారి వివాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి సునీతారెడ్డి భర్త దివంగత లక్ష్మారెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు రక్తదానం ఏర్పాటు చేయాలనుకున్నారు. ఛారిట్రబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఈ రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు చేశారు. అయితే, దీనిని స్థానిక టీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకించారు. దీంతో సునీతలక్ష్మారెడ్డి వర్గీయుల ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సునీతా లక్ష్మారెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీస్ వాహనాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సంఘటనతో సునీతా లక్ష్మారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. 

అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే టీఆర్ఎస్ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, టీఆర్ఎస్ నాయకులు పిరికిపందలు అని మండిపడ్డారు. రక్తదానం కార్యక్రమం నిర్వహించి తీరతామని, అవసరమైతే రోడ్డుపైనా పడుకుని అయినా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, పోలీసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

More Telugu News