India: భయపడొద్దు.. విదేశీ కరెన్సీ నిల్వలు దండిగా ఉన్నాయ్!: దేశ ప్రజలకు జైట్లీ అభయం

  • రూపాయి విలువ పడిపోవడంపై స్పందించిన మంత్రి
  • విదేశీ కరెన్సీ నిల్వలు కావాల్సినంత ఉన్నాయని వెల్లడి
  • అంతర్జాతీయ పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్న జైట్లీ

రూపాయి విలువ దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. దేశంలో తగినంత విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయనీ, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనే సామర్థ్యం దేశానికి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు జైట్లీ ట్విట్టర్ లో స్పందించారు.

అమెరికా ఆంక్షల నేపథ్యంలో టర్కీ కరెన్సీ లీరా విలువ కూప్పకూలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో డాలర్ కు రూపాయి విలువ రూ.70.09 కి పడిపోయింది. ఇది ఆల్ టైం గరిష్టం కావడం గమనార్హం. కాగా, అంతర్జాతీయ పరిస్థితులను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని జైట్లీ తెలిపారు. మరోవైపు ప్రస్తుతం దేశంలో 402.7 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

More Telugu News