KTR: కేటీఆర్ ను మరోసారి టార్గెట్ చేసిన వీహెచ్

  • బీజేపీ హయాంలో జరిగిన రాఫెల్ స్కాం గుర్తుకు రాలేదా?
  • స్పీకర్ కు హైకోర్టు నోటీసులు రావడం సిగ్గు చేటు
  • కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లను 69 శాతానికి పెంచాలి

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. కార్గిల్ యుద్ధంలో భారత్ గెలవడానికి బోఫోర్స్ తుపాకులే కారణమనే విషయాన్ని మర్చిపోవద్దు అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అన్నీ స్కాములేనని... ఏ అంటే ఆదర్శ్, బీ అంటే బోఫోర్స్, సీ అంటే కామన్ వెల్త్... ఇంకా చెప్పమంటారా రాహుల్ సార్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపైనే వీహెచ్ మండిపడ్డారు. బీజేపీ హయాంలో చోటు చేసుకున్న రాఫెల్ విమానాల స్కాం గురించి ఎందుకు ప్రశ్నించలేదని కేటీఆర్ ను నిలదీశారు.

ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల కేసులో స్పీకర్ మధుసూదనాచారికి హైకోర్టు నోటీసులు ఇవ్వడం కేసీఆర్ ప్రభుత్వానికి సిగ్గుచేటని వీహెచ్ అన్నారు. బీసీలపై కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే... బీసీ రిజర్వేషన్లను 69 శాతానికి పెంచి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టించాలని సవాల్ విసిరారు. 

More Telugu News