Vijayawada: విజయవాడలో వ్యభిచారం పేరిట ఆన్ లైన్ మోసం.. అదుపులో నిందితులు

  • ఆన్ లైన్ మోసానికి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు
  • ఫేక్ అకౌంట్లతో డబ్బులు దోచుకున్న వైనం
  • ఇద్దరు నిందితులపై కేసులు నమోదు

విజయవాడలో వ్యభిచారం పేరిట ఆన్ లైన్ మోసానికి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. సామాజిక మాధ్యమాల్లో యువతుల ఫేక్ ఫొటోలను ఉంచి మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ అకౌంట్లతో డబ్బులు దోచుకున్న ముఠా సభ్యులకు సంబంధించి కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదు అకౌంట్ల ద్వారా యువకుల నుంచి మొత్తం రూ.20 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారానికి  సంబంధించి గుంటూరుకు చెందిన రాజేశ్వరి అనే మహిళను, ఓ యువకుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, విజయవాడకు చెందిన ఓ యువతి ఫొటో పెట్టడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితులు ఇద్దరిపై సెక్షన్ 420, సైబర్ నేరం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

More Telugu News