kcr: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ప్రసంగం.. ముఖ్యాంశాలు

  • నేటి నుంచే రైతు బీమా పథకం అమల్లోకి వస్తుంది
  • 24 గంటలు విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
  • ఇప్పటి వరకు 2,72,723 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించాం

72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే.

  • ఈరోజు నుంచే రైతు బీమా పథకం అమల్లోకి వస్తుంది. 
  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా రు. 6 లక్షలు ఇస్తాం. 
  • యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు పనిముట్లపై 50 నుంచి 90 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. 
  • రైతు వేదికలు నిర్మిస్తున్నాం. 
  • డ్రిప్ ఇరిగేషన్ ను ప్రోత్సహిస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్ పై చిన్న, సన్నకారు రైతులు, దళితులకు 90 శాతం సబ్సిడీ కల్పించబోతున్నాం. 
  • మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాం. 
  • 22.47 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోడౌన్ల నిర్మాణాన్ని చేపట్టాం. 
  • నవంబర్ లో రైతుబంధు రెండో విడత చెక్కులు పంపిణీ చేస్తాం. 
  • కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం. 
  • 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 
  • రికార్డు సమయంలో భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తి చేశాం. 
  • త్వరలోనే తెలంగాణ మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా అవతరించబోతోంది. 
  • మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేస్తున్నాం. 
  • గొల్లకుర్మలకు 65 లక్షల గొర్రెలతో పాటు దాణాను పంపిణీ చేస్తున్నాం. 
  • బర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం. 
  • మత్స్యకారులను ఆదుకునేందుకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. 
  • చేనేత, పవర్ లూమ్ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. 
  • సంచార కులాల అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు కేటాయించాం. 
  • నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఆధునిక వస్తువులు అందజేస్తాం. 
  • వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కును నిర్మిస్తున్నాం. 
  • 4 లక్షల మంది బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల పెన్షన్ అందిస్తున్నాం. 
  • ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికే ఖర్చు చేస్తున్నాం. 
  • దళితులకు 12,974 ఎకరాల భూమిని పంపిణీ చేశాం. 
  • 5 వేల మంది మౌజమ్, ఇమామ్ లకు జీవనభృతి కల్పించాం. 
  • మిషన్ భగీరథ దాదాపుగా పూర్తి అయింది. 
  • ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్సులు అందిస్తున్నాం. 
  • బీసీలకు మరో 119 రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం. 
  • రాష్ట్రంలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. 
  • మైనార్టీ యువతకు 80 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తున్నాం. 
  • విదేశీ విద్య కోసం రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. 
  • 7 జోన్లు, 2 మల్టీ జోన్లకు త్వరలోనే కేంద్రం నుంచి ఆమోదం లభిస్తుంది. 
  • ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది. 
  • హరితహారంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. 
  • ఇప్పటి వరకు 2,72,723 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించాం. 
  • పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తయారవుతోంది. 
  • హైదరాబాద్ సిగ్నల్ ఫ్రీ సిటీగా అవతరిస్తోంది. 
  • ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం పోలీసుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. 
  • హైదరాబాదులో మరో రెండు రిజర్వాయర్లను నిర్మిస్తున్నాం. 
  • జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులను బాగు చేస్తున్నాం. 
  • త్వరలోనే మెట్రో రెండో దశ సేవలు ప్రారంభమవుతాయి. 
  • ఔటర్ రింగ్ రోడ్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తాం. 

More Telugu News