Antariksham: ‘అంతరిక్షం’లో వరుణ్ తేజ్.. ఫస్ట్ లుక్ విడుదల!

  • సినిమా పేరు ‘అంతరిక్షం’గా ఖరారు
  • డిసెంబర్ లో రిలీజ్ కు సన్నాహాలు
  • విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్న సంకల్ప్ రెడ్డి

ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి అంతరిక్షం నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘అంతరిక్షం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. 9000 కేఎంపీహెచ్ అన్నది ఉపశీర్షిక. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసింది. ఇందులో అంతరిక్షంలో స్పేస్ సూట్ లో వరుణ్ దేనినో సీరియస్ గా పరిశీలిస్తున్నాడు. ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన అతిదిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. ఘాజీతో తొలి సినిమాకే హిట్ అందుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ గ్రాఫిక్స్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని చిత్ర బృందం నమ్మకంతో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 21న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

More Telugu News